ఇంటర్వ్యూ: రకుల్ ప్రీత్ సింగ్ – ఈ సినిమా నేనే చేస్తానని కళ్యాణ్ ను బ్రతిమాలాను !

ఇంటర్వ్యూ: రకుల్ ప్రీత్ సింగ్ – ఈ సినిమా నేనే చేస్తానని కళ్యాణ్ ను బ్రతిమాలాను !

Published on May 22, 2017 8:45 PM IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన తాజా చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ నెల 26న సినిమా రిలీజ్ కానున్న సందర్బంగా ఆమె మీడియాతో చిత్రం గురించి మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నాది భ్రమరాంబ క్యారెక్టర్. అన్నీ తెలుసనుకుని ఏమీ తెలియని ఒక అమ్మాయి పాత్ర. ఎప్పుడూ తాను అనుకున్నదే జరగాలని అనుకుంటుంది. ఎవరి మాటా వినదు. ట్రైలర్లో చెప్పినట్టు కొంచెం పిచ్చతనం, కొంటెతనం, మొండితనం మిక్సీసీలో వేసినట్టు ఉంటుంది.

ప్ర) మీరు చేసిన ఇంతకు ముందు పాత్రలకి ఈ పాత్రలో తేడా ఏంటి ?
జ) ఇంతకూ ముందు చేసిన వాటిలో ఎక్కువగా మాడరన్ అమ్మాయిగానే కనబడ్డాను. కానీ ఇందులో మాత్రం పూర్తి విలేజ్ గర్ల్ గా కనబడతాను. ఎక్కువ హాఫీ శారీలు కట్టుకుని ట్రెడిషనల్ గా ఉంటాను.

ప్ర) సినిమా ఫ్యామిలీ డ్రామా కదా.. షూట్ చేసేప్పుడు మీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా ?
జ) లేదు. అస్సలు గుర్తుకురాలేదు. సినిమాలో చేసిన వాళ్లంతా నాకు చాల దగ్గరయ్యారు. వాళ్లతో ఉంటే నా ఫ్యామిలీతో ఉన్నట్టే ఉంటుంది.

ప్ర) నాగ చైతన్యతో ఫస్ట్ టైమ్ వర్క్ ఎలా ఉంది ?
జ) చైతన్య నాకు ముందు నుంచీ ఫ్రెండ్. కాబట్టి వర్క్ చాల ఈజీ అయింది. ఇక చైతన్య విషయానికొస్తే చాలా ఇన్నోసెంట్. అతన్ని చూసి చాలా మంది అబ్బాయిలు నేర్చుకోవాలి. అక్కినేని లాంటి గొప్ప ఫ్యామిలీలో పుట్టి కూడా చాలా సింపుల్ గా ఉంటారు.

ప్ర) మీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గురించి ?
జ) కళ్యాణ్ కృష్ణ చల్ మంచి డైరెక్టర్. ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటారు. అతనికి ఏం కావాలో చాలా క్లియర్ గా ఉంటాడు. ఇంత మంచి పాత్రను నాకిచ్చినందుకు ఆయనకు చాలా థ్యాంక్స్. ఆయన నాకోసమే 4 నెలలు వెయిట్ చేశారు. నేను కూడా ఆయన్ను ఈ సినిమా నేనే చేస్తానని బ్రతిమాలాను(నవ్వుతూ). ఆయన నెక్స్ట్ సినిమా కూడా నేనే చేస్తానని కూడా చెప్పేశాను.

ప్ర) చాలా ఆఫర్లొస్తున్నాయి కదా సరైన స్క్రిప్ట్ ను ఎలా చూజ్ చేసుకుంటారు ?
జ) మన దగ్గరకు ఎన్ని సినిమాలు వచ్చినా వాటిలోనో నుండే ఒక సినిమాను తీసుకోవాలి. నేను కూడా అంతే. నాకు సరిపోతుందనుకున్న పాత్రను, కథను చూజ్ చేసుకుంటా.

ప్ర) పెద్ద హీరోలు, చినన్ హీరోల సినిమాలు చేస్తున్నారు. ఎలా ఉంది ?
జ) నా దృష్టిలో చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనేం లేదు. నేను చేస్తునం సినిమాకి, కథకు న్యాయం చేస్తున్నానా లేదా అనేది మాత్రమే చూస్తాను.

ప్ర) మిమ్మల్ని అందరూ లక్కీ లక్కీ అంటున్నారు. మీ కామెంట్ ?
జ) ఒకరు లక్కీ అని మరొకరు ఆన్ లక్కీ అనేం లేదు. అందరూ ఒక్కటే. అయినా నేనున్నంత మాత్రాన సినిమా హిట్టైపోతుందంటే నేను నమ్మను. అందరూ కలిసి కష్టపడితేనే హిట్ అనేది వస్తుంది.

ప్ర) బాలీవుడ్ ఆలోచనలేమైనా ఉన్నాయా ?
జ) ప్రస్తుతానికి ఇక్కడ బాగానే ఉంది. మంచి సినిమాలున్నాయి. నాకు మంచి ఐడెంటిటీ ఇచ్చింది తెలుగువాళ్లే. అలాంటప్పుడు అక్కడికి వెళ్లడం దేనికి. అక్కడ కూడా మంచి సినిమాలు వస్తే తప్పకుండా చేస్తాను.

ప్ర) దేవిశ్రీ మ్యూజిక్ గురించి చెప్పండి ?
జ) దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా మంచి పాటల్ని ఇచ్చారు. అన్నీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉన్నాయ్. నా వరకు నాకు ‘రారండోయ్ వేడుక చూద్దాం, తకిట తకజం’ పాటలు చాలా ఇష్టం.

ప్ర) ఫైనల్ గా నిర్మాత నాగార్జునగారి గురించి చెప్పండి ?
జ) నాగార్జునగారు చాలా మంచివారు. అన్నే దగ్గరుండి చూసుకున్నారు. ప్రతి రెండు మూడు రోజులకొకసారి వచ్చి ఏం కావాలో అడిగేవారు. సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగా చేశావని మెచ్చుకున్నారు. అది నా లైఫ్లో నేను మర్చిపోలేని కాంప్లిమెంట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు