మరోసారి రాశీఖన్నాతో రవితేజ రొమాన్స్?

మరోసారి రాశీఖన్నాతో రవితేజ రొమాన్స్?

Published on Feb 9, 2016 8:37 AM IST

rasi-kanna-and-ravi-teja
సినీ పరిశ్రమలో సూపర్ హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవుతూ ఉండడం చాలా కామన్ గా జరిగే విషయం.. అది హీరో – డైరెక్టర్ కావచ్చు లేదా హీరో – హీరోయిన్ ఇలా ఏదైనా కావచ్చు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే మాస్ మహారాజ్ రవితేజ తనతో హిట్ పెయిర్ గా నిలిచిన రాశీ ఖన్నాతో మరోసారి జోడీ కట్టడానికి సిద్దమయ్యాడట. ఇదే విషయాన్ని ఫిల్మ్ నగర్ వర్గాలు కూడా నిజమనే అంటున్నాయి. ఇంతకీ ఏ సినిమా కోసం అనే విషయంలోకి వెళితే. చక్రి అనే దర్శకుడిని పరిచయం చేస్తూ రవితేజ హీరోగా చేయనున్న సినిమా ‘రాబిన్ హుడ్’.

స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని మార్చి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారని ఇది వరకే తెలియజేశాం. దాంతో డైరెక్టర్ చక్రి నటీనటులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డాడు. మొదటగా ఈ సినిమాలో రవితేజకి జోడీగా అమీ జాక్సన్ ని హీరోయిన్ గా ట్రై చేసారు, కానీ తనకు డేట్స్ అడ్జస్ట్ కాక కుదరకపోవడంతో ఇప్పుడు ఈ చిత్ర టీం బెంగాల్ టైగర్ లో రవితేజ సరసన నటించి హిట్ పెయిర్ అనిపించుకున్న రాశీ ఖన్నాని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి సిద్దమయ్యారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే రాశీఖన్నా ఈ సినిమాకి సైన్ చేయనుంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు