మరోసారి టాలెంట్ చూపించిన రామ్ గోపాల్ వర్మ !

మరోసారి టాలెంట్ చూపించిన రామ్ గోపాల్ వర్మ !

Published on Dec 7, 2016 10:00 PM IST

nayeem
రామ్ గోపాల్ వర్మ.. భిన్నమైన మేకింగ్ స్టైల్ కి మాత్రమే కాకుండా పాత్ర చిత్రీకరణలో కూడా వర్మది అందరి దర్శకులకన్నా అందెవేసిన చెయ్యనే చేప్పాలి. ముఖ్యంగా వాస్తవ కథలను తెరకెక్కించేటప్పుడు కథలోని వాస్తవ పాత్రలను పోలిన నటుల్ని ఎంచుకోవడం, వాస్తవ పాత్రల నడవడికను ఆ నటీ నటుల్లో కనబరచడం వంటి అంశాల్లో వర్మ నూటికి నూరు శాతం ఖచ్చితత్వం పాటిస్తాడు. ఆయన తీర్చిదిద్దిన పాత్రల్లో 26/11 సినిమాలోని కసబ్, రక్త చరిత్రలో సూర్య, వివేక్ ఒబెరాయ్ ల పాత్రలు, తాజా చిత్రం ‘వంగవీటి’ లో రంగ పాత్ర వంటివే అందుకు నిదర్శనాలు.

ఇవి కాకుండా వర్మ మరో వాస్తవ పాత్రను అచ్చు గుద్దినట్టు తీర్చిదిద్ది మరోసారి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. అదే నయీమ్ పాత్ర. హైదరాబాద్ గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ లో చనిపోయాక అతని జీవితం మీద దృష్టిపెట్టిన వర్మ మొత్తం వివరాలన్నీ సేకరించి కథ తయారు చేసి సినిమా షూటింగ్ షురూ చేసేశాడు. దానికి సంబందించి షూటింగ్ స్పాట్ లోని వర్కింగ్ స్టిల్స్ కొన్ని కొద్దిసేపటి క్రితమే బయటికొచ్చాయి. వాటిలో నయీమ్ పాత్ర పోషిస్తున్న నటుడు కూడా ఉన్నాడు. అతన్ని చూస్తే అచ్చు చనిపోయిన నయీమ్ నిజ రూపాన్ని చూసినట్టే ఉంది. కాస్ట్యూమ్ డెస్సింగ్ స్టైల్, ముఖ ఛాయలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఒరిజినల్ నయీమ్ కు చాలా దగ్గరగా ఉన్నాయి. వాటిని చూసిన అందరూ వర్మ మరోసారి టాలెంట్ చూపించాడు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు