ఒకరోజు గ్యాప్ తర్వాత మొదలైన ‘బాహుబలి’ షూటింగ్

ఒకరోజు గ్యాప్ తర్వాత మొదలైన ‘బాహుబలి’ షూటింగ్

Published on Oct 24, 2014 8:27 AM IST

Bahubali
టాలీవుడ్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘బాహుబలి’. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ చిత్ర టీం గత నాలుగైదు నెలల నుంచి ఏ మాత్రం విశ్రాంతి లేకుండా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వెళ్ళు దీపావళి సందర్భంగా ఒక్క రోజు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఈ రోజు నుంచి యధావిధిగా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ప్రసతుతం ప్రభాస్ తదితరులపై కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా ప్రభాస్ బ్రోతె గా కనిపిస్తుంటే అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విజువల్ వండర్ గా ఉండేలా తీస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. ఈ సినిమాని రెండు పార్ట్స్ గా మన ముందుకు తీసుకురానున్నారు. అందులో ఒక పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుంటే, రెండవ పార్ట్ 2016 సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు