ఒక్క రోజు విశ్రాంతి – ‘బాహుబలి’ న్యూస్ అప్డేట్..!

ఒక్క రోజు విశ్రాంతి – ‘బాహుబలి’ న్యూస్ అప్డేట్..!

Published on Jul 31, 2014 12:37 PM IST

bahubali-first-look

గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో ‘బాహుబలి’ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ప్రభాస్, తమన్నాలపై ఒక రొమాంటిక్ సాంగ్ తో పాటు, మరొక హీరోయిన్ అనుష్క పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేశారు. బుధవారం(నిన్నటి)తో ఈ షెడ్యూల్ పూర్తయింది. తర్వాత షెడ్యూల్ శుక్రవారం(రేపటి) నుండి ప్రారంభం అవుతుంది. మధ్యలో ఒక్క రోజు విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి రోజున నెక్స్ట్ షెడ్యూల్ కోసం ప్రిపరేషన్ సెషన్స్ జరుగుతున్నాయి.

అత్యంత భారి బడ్జెట్ తో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ 2015 ఏప్రిల్ లో విడుదల కానుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు