ఏప్రిల్ 27న ఊహలు గుసగుసలాడే ఆడియో

ఏప్రిల్ 27న ఊహలు గుసగుసలాడే ఆడియో

Published on Apr 22, 2014 11:46 PM IST

Oohalu-Gusagusalade
ఊహలు గుసగుసలాడే సినిమా ఆడియో విడుదలఈనెల 27న వైభవంగా జరగనుంది. ఈ సినిమాకు శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. నాగ సౌర్య, రాశి ఖన్నా ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో హీరో, హీరోయిన్స్

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముగించుకుని నిర్మాణాంతర దశలోవుంది. హైదరాబాద్ కు చెందిన యువకుడికి ఆంధ్రప్రదేశ్ ను చూడడానికి డిల్లి నుంచి వచ్చిన యువతికి మధ్య జరిగే ప్రేమకధే ఈ చిత్ర కధాంశం. హైదరాబాద్, వైజాగ్ లలో ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనివాస్ అవసరాల ఒక ముఖ్య పాత్రను పోషించారు

కళ్యాణికోడూరి అందించిన సంగీతం వేల్ రికార్డ్స్ ద్వారా మనముందుకు రానుంది. ఈ సినిమా త్వరలో విడుదలకానుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు