మెగాస్టార్ చిరంజీవి కోసం ఆస్కార్ విజేత !


తన 150 వ సినిమా ‘ఖైదీ నెం 150’ తో విజయవంతంగా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పనుల్లో బిజీగా ఉండగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి నటీ నటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ స్టైలిష్ డైరెక్టర్ సినిమా కోసం ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ ను కలిశారని వినికిడి.

అయితే రెహమాన్ మాత్రం ఇంకా తన తుది నిర్ణయాన్ని చెప్పలేదట. మరి రెహమాన్ చిరు కోసం పని చేస్తారో లేదో తెలియాలంటే ఇంకొద్ది సమయం వేచి చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్, అనుష్క, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా వంటి టాప్ హీరోయిన్ల పేర్లు వినిపించినా ఎవరూ ఇంకా ఫైనల్ కాలేదు. తొట్ట తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని చిరు తనయుడు రామ్ చరణ్ సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

 

Like us on Facebook