బాలయ్య తగ్గినా ‘అర్జున్ రెడ్డి’ తగ్గడం లేదు !
Published on Sep 13, 2017 1:51 pm IST


నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ భారీ అంచనాల నడుమ విడుదలైనప్పటికీ మొదటి రోజు వచ్చిన మిశ్రమ స్పందన వలన మొదటి నాలుగు రోజుల తర్వాత కలెక్షన్ల పరంగా నెమ్మదించిపోయింది. కృష్ణా ఏరియాలో చూసుకుంటే 12వ రోజు వరకు రూ.1. 13 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం 13వ రోజు బాగా క్షీణించి రూ.36,000 షేర్ మాత్రమే అందుకుని మొత్తంగా రూ.1.14 దగ్గర నిలిచింది. ఇక రానున్న రోజుల్లో కూడా కొత్త చిత్రాల విడుదల ఉండటం వలన ఈ కలెక్షన్స్ ఇంకాస్త తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక సూపర్ హిట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ మాత్రం నిలకడగా కొనసాగుతూ నిన్న 19వ రోజు కూడా రూ.97,559 షేర్ రాబట్టి టోటల్ గా రూ.1. 07 కోట్ల షేర్ ఖాతాలో వేసుకుంది. ఇంకొద్దిరోజుల పాటు ఈ రన్ ఇలానే కొనసాగే ఛాన్సుంది. గత వారం విడుదలైన నరేష్ చిత్రం ‘మేడ మీద అబ్బాయి’ నిన్న 5వ రోజు రూ. 1.4 లక్షల షేర్ కలెక్ట్ చేసి మొత్తంగా రూ.21.6 లక్షల షేర్ మార్క్ వరకు చేరింది.

 
Like us on Facebook