పాకిస్థాన్ లో ‘ధోనీ’ ని బ్యాన్ చేశారు

పాకిస్థాన్ లో ‘ధోనీ’ ని బ్యాన్ చేశారు

Published on Sep 28, 2016 6:32 PM IST

ms-dhoni
భారత క్రికె జట్టు కెప్టెన్, కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న క్రికెటర్ ఎమ్ఎస్ ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఎమ్ఎస్ ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ’ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న భారతీయుల, ధోనీ అభిమానులు సినిమా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఒక్క పాకిస్థాన్ లో మాత్రం ఈ సినిమాను బ్యాన్ చేశారు.

ఇటీవల భారత్ పై జరిగిన ఉగ్రదాడి నైపథ్యంలో భారత్ లోని ‘మహారాష్ట్ర నిర్మాణ సేవ’ ఇంకో రెండు రోజుల్లో పాకిస్థాన్ నటులు ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ లు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞాపించింది. దీనికి బదులుగా సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు పొందిన పాక్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఐ.ఎం.జి.సి గ్లోబర్ ఎంటర్టైన్మెంట్స్ పాక్ లో ధోని సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నీరజ్ పాండే తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగులో కూడా ఈ నెల 30న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు