“పక్కా కమెర్షియల్”గా స్టార్టైన గోపీచంద్.!

“పక్కా కమెర్షియల్”గా స్టార్టైన గోపీచంద్.!

Published on Mar 6, 2021 2:03 PM IST

టాలీవుడ్ యాక్షన్ కటౌట్స్ లో మ్యాచో మేన్ గోపీచంద్ కూడా ఒకరు. అంతే కాకుండా మోస్ట్ అండర్ రేటెడ్ హీరోల్లో కూడా గోపీచంద్ ఒకరు. అయితే ఇప్పుడు ఈ యాక్షన్ హీరో సంపత్ నంది దర్శకత్వంలో “సీటీ మార్” అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇది రిలీజ్ కు కూడా రెడీ అవుతుంది.

మరి ఇది లైన్ లో ఉండగానే హిట్ దర్శకుడు మారుతితో ఒక ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అదే “పక్కా కమెర్షియల్”. మొదటి నుంచి ఆసక్తికర ప్రమోషన్స్ తో అనౌన్స్ కాబడిన ఈ చిత్రం ఈరోజు నుంచి షూట్ స్టార్ట్ చేసుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ మొదటి రోజు షూట్ కార్యక్రమంలో టాలీవుడ్ టాప్ నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు మారుతి అలాగే నటుడు సత్యరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే అక్టోబర్ 1న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు మరియు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు