‘పండగ చేస్కో’ రన్‌టైమ్ వివరాలివీ!

‘పండగ చేస్కో’ రన్‌టైమ్ వివరాలివీ!

Published on May 27, 2015 10:15 PM IST

Pandaga-Chesuko
ఎనర్జిటిక్ హీరో రామ్, సూపర్ హిట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కిన తాజా సినిమా ‘పండగ చేస్కో’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 29న భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. సెన్సార్ తరపున యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 2 గంటల 42నిమిషాల నిడివితో విడుదల కానుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది.

రెండున్నర గంటలపాటు అల్లరి అల్లరిగా సాగనున్న ఈ సినిమాలో్ రామ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్‌లు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ‘పండగ చేస్కో’ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే నిర్మాత పరుచూరి కిరీటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్‌లో కూడా భారీగా రిలీజ్ చేయనున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్‌లేని రామ్, ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ పడతాడా అన్నది వేచిచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు