నారా రోహిత్ హీరోగా ‘పంజా’ నిర్మాత కొత్త సినిమా.

నారా రోహిత్ హీరోగా ‘పంజా’ నిర్మాత కొత్త సినిమా.

Published on Sep 18, 2014 5:20 PM IST

nilima-nararihith
ప్రతి సినిమాలో కథ, కథనంలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే ఈ హీరో నారా రోహిత్. వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో మరో కొత్త సినిమాను అంగీకరించాడు. ఈ సినిమా టైటిల్ ‘సావిత్రి’. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు.

‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం పవన్ సాధినేని ఈ సినిమాకు దర్శకుడు. శ్రవణ్ సంగీత దర్శకుడు. సంఘమిత్రా ఆర్ట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా ‘పంజా’ సినిమాను రూపొందించిన నీలిమ తిరుమల శెట్టి, నగేష్ ముంతా లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

నారా రోహిత్ నటించిన ‘రౌడీ ఫెలో’ ఆడియో ఇటివలే విడుదలయింది. సున్నీ యంఆర్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తుంది. లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య ‘రౌడీ ఫెలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు