మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ‘పాఠశాల’ ట్రైలర్

మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ‘పాఠశాల’ ట్రైలర్

Published on Jul 30, 2014 11:40 AM IST

Patasala

‘వినాయకుడు’ ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న మహి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘పాఠశాల’. ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవలే అధికారికంగా లాంచ్ చేసారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ట్రైలర్ చాలా ఫ్రెష్ గా ఉందని అంటున్నారు. అలాగే ఈ ట్రైలర్ కి యువత నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలాంటి స్టార్ హీరో మరియు బిగ్గెస్ట్ ప్రొడక్షన్ టీం లేని ఓ చిన్న సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చెప్పుకోదగిన విషయం.

ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ఓ ఐదుగురు ఫ్రెండ్స్ ప్రయాణమే ఈ సినిమా. ట్రైలర్లో వచ్చే వన్ లైన్ డైలాగ్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. హిందీలో వచ్చిన దిల్ చాహతా హై, జిందగీ నా మిలేగా దోబారా లాగా రోడ్ జర్నీ సినిమా తెలుగులో రావడం ఇదే ప్రధమం అని చెప్పుకోవాలి. హ్యాపీ డేస్ స్టైల్ లో ఈ సినిమా ఉంటుందని కానీ ఆ జోనర్ కి ఈ జోనర్ కి అస్సలు సంబంధం ఉండదని ఈ చిత్ర టీం అంటోంది. నూతన నటీనటుల నటన, ఫ్రెష్ కాన్సెప్ట్, ఫీల్ గుడ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది.

CLICK HERE FOR TRAILER

సంబంధిత సమాచారం

తాజా వార్తలు