సినిమాల్లో ఎంత వరకు కొనసాగేది చెప్పిన పవన్ కళ్యాణ్ !
Published on Feb 11, 2017 3:59 pm IST


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యూఎస్ పర్యటనలో భాగంగా హ్యామ్ప్ షైర్ లోని నషువా నగరంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో చేసిన ప్రసంగం తెలుగువారిని ముఖ్యంగా ఆయన అభిమానులను చాలా బాగా ఆకట్టుకుంటోంది. లోకల్ గా ప్రసంగాలు చేసినప్పుడు చెప్పని చాలా విషయాలను పవన్ ఈ ప్రసంగంలో ప్రస్తావించారు. ముఖ్యంగా సినిమాల పట్ల ఆయన దృక్పథం ఏమిటో తెలిపారు. అసలు సినిమాలెందుకు చేస్తున్నదీ, ఎప్పటిదాకా చేసేదీ కూడా తెలిపారు.

సినిమాల్లో నటిస్తుంటే తనకు సంతృప్తి ఉండదని, ప్రజా సమస్యలపై పోరాడినప్పుడే రిలీఫ్ గాఅనిపిస్తుందని చెప్పిన పవన్ ‘కేవలం ఏడు సినిమాలు చేసి వెళ్లిపోదామనుకున్న కానీ కుదరలేదు. ఒకవేళ ‘జానీ’ సినిమా గనుక హిట్టయ్యుంటే వెళ్లిపోయేవాడినేమో. ఇంకెన్నాళ్లు సినిమాలు చేస్తానంటే చెప్పలేను. ఒకవేళ భాద్యతలు ఎక్కువైనప్పుడు అవి ఆలస్యం కావచ్చు. అలాగని సినిమాలంటే నాకు విముఖత లేదు. అవంటే నాకు గౌరవం. సినిమా వలన వచ్చిన ఇమేజ్ ను ఇలా ప్రజా సమస్యలపై పోరాటం కోసం వాడుకుంటున్నందుకు ఆనందంగా ఉంది’ అన్నారు.

 
Like us on Facebook