‘గబ్బర్ సింగ్ 2’ స్క్రిప్ట్ లో పవన్ హ్యాండ్..!

‘గబ్బర్ సింగ్ 2’ స్క్రిప్ట్ లో పవన్ హ్యాండ్..!

Published on Jul 31, 2014 10:11 AM IST

pawan kalyan

‘నాకు కొంచం తిక్కుంది.. దానికో లేక్కుంది’ అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ చేసిన హంగామాను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. వాటిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ‘గబ్బర్ సింగ్-2’ మూవీ యూనిట్. అందుకే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. సంపత్ నంది రాసిన ‘గబ్బర్ సింగ్-2’ స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. కథ, స్క్రీన్-ప్లే విషయాలలో పవన్ తన రచనకు పని చెప్పారు.

‘గోపాల గోపాల’ షూటింగ్ పూర్తయిన ‘గబ్బర్ సింగ్ 2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. అక్టోబర్ నుండి పవన్ ‘గబ్బర్ సింగ్ 2’కు డేట్స్ కేటాయించారని సమాచారం. ఈ లోపు స్క్రిప్ట్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ 2 చిత్రానికి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరుగుతుంది. త్వరలో మరిన్ని వివరాలను వెల్లడిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు