ఒకే పాత్రలో మామ అల్లుడు !

ఒకే పాత్రలో మామ అల్లుడు !

Published on Dec 13, 2017 8:53 AM IST

యువ హీరో సాయి ధరమ్ తేజ్ కు మంచి మార్కెట్ ఉంది. తక్కువ కాలంలో హిట్ సినిమాలు చేసి టాలెంట్ నిరూపించుకున్న ఈ హీరో ప్రస్తుతం వివి.వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆకుల శివ ఈ సినిమాకు కథ మాటలు రాసున్నారు. తాజా సమాచారం మేరకు సాయి ఈ సినిమాలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

అజ్ఞాతవాసి సినిమా లో కూడా పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్ రోల్ లో నటిస్తుండడం విశేషం. బాబాయి, మామ, అల్లుడు ఒకే రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అజ్ఞాతవాసి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వినాయక్, సాయి ధరమ్ తేజ్ మూవీ ఫిబ్రవరిలో విడుదల కానుంది, ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు