రేణు దేశాయ్ టీంకు విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్.

రేణు దేశాయ్ టీంకు విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్.

Published on Jul 22, 2014 3:43 AM IST

pavan-renu-deshay
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ దర్శకనిర్మతగా తెరకెక్కిస్తున్న తోలి చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’. మరాఠీలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో మంగళవారం విడుదల అవుతుంది. ఈ సినిమా ఆడియోకి పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించారు రేణు దేశాయ్. సోమవారం నుండి పవన్ ‘గోపాలా గోపాలా’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. బ్యాక్ పెయిన్ సమస్య ఉండడంతో మహారాష్ట్రలో జరిగే ఆడియో వేడుకకు హాజరు కాలేకపోతున్నారు. ‘ఇష్క్ వాలా లవ్’కు విశేష్ తెలియజేశారు.

ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేశారు. మొత్తం 9 పాటలు ఉన్నాయి. ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాకు మరో ప్రత్యేకత ఎస్.జె.సూర్య సంగీతం. పవన్ కళ్యాణ్ ఖుషి, పులి చిత్రాల దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు పాటలను కంపోజ్ చేశారు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు