కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్.!

కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్.!

Published on Aug 11, 2020 7:02 AM IST

ఈ మధ్య కాలంలో మన స్టార్ హీరోల అభిమానుల జన్మదిన వేడుకలు కూడా ట్రెండ్ మారిపోయాయి. ఈ ట్రెండ్ కు సరైన వేదికగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మారింది. దీనితో ఆఫ్ లైన్ సంబరాల కంటే కూడా ఆన్లైన్ సంబరాలే హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏ స్టార్ హీరో అభిమానులు ఎంత భారీ మొత్తంలో ట్రెండ్ చేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు.

ఇలాంటి ట్రెండ్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎవరికి ఎవరూ తీసిపోరు. ట్విట్టర్లో ఓ పవర్ ఫుల్ ట్రెండ్ ఉంది అంటే వీరి పేరిటే నెంబర్ 1,2 రికార్డులు ఉంటాయి. అలా లేటెస్ట్ గా మహేష్ అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజుకు కనీ వినీ ఎరుగని రేంజ్ రికార్డ్ ను దాదాపు 6 కోట్ల ట్వీట్స్ తో దుమ్ము లేపేశారు.

ఇక లైన్ లో ఉంది పవన్ ఫ్యాన్స్. దీనితో వారికి ఇప్పుడు చిన్న కన్ఫ్యూజన్ పట్టుకుంది. ఈ భారీ టార్గెట్ ను పవన్ పుట్టునరోజుకు బ్రేక్ చెయ్యాలా? లేక ఈ ఆగస్ట్ 15 న విడుదల చేయబోయే కామన్ డీపీ ట్రెండ్ తో చెయ్యాలా అని ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి ఈ ట్రెండ్స్ గోల మాత్రం మన స్టార్ హీరోల అభిమానుల్లో రచ్చ లేపుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు