అభిమానాన్ని మితిమీరిన స్థాయికి తీసుకెళ్ళొద్దు : పవన్ కళ్యాణ్

pawa
కొద్దిరోజుల క్రితం ఓ గొడవలో గాయపడి చనిపోయిన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఉదయం తిరుపతికి వెళ్ళిన విషయం తెలిసిందే. అభిమానులే దైవమని చెబుతూ, వారికి ఎప్పుడూ అండగా నిలబడుతూ ఉండే పవన్, వినోద్ కుటుంబానికి కూడా అండగా నిలబడతానని చెబుతూ, ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పవన్ స్థాపించిన జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చిన వినోద్, ఏ హీరో గొప్ప అన్న అంశంపై ఓ గొడవ రావడంతో, ఆ గొడవలో పలువురు దాడి చేయగా చనిపోయాడు.

ఇక వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. “హీరోలందరూ సమానమే. మేమందరం బాగానే కలిసి ఉన్నాం. మా హీరో గొప్ప అంటూ గొడవపడడం అభిమానులకు మంచిది కాదు. నేనైతే దీన్ని క్షణికావేశం వల్ల జరిగిన హత్యగా చూస్తున్నా. ఏదేమైనా అభిమానం పేరుతో చంపుకునేదాకా వెళ్ళడం మంచిది కాదు. అభిమానాన్ని మితిమీరిన స్థాయికి తీసుకెళ్ళి హింసకు దారితీసేలా చేయొద్దని కోరుకుంటున్నా” అని సందేశమిచ్చారు.

 

Like us on Facebook