పవన్ కళ్యాణ్.. బెస్ట్ ఫిల్మ్ మేకింగ్ టీచర్ – రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్.. బెస్ట్ ఫిల్మ్ మేకింగ్ టీచర్ – రేణు దేశాయ్

Published on Sep 1, 2014 2:00 PM IST

Pawan-kalyan-Renu-Desai
‘ఇష్క్ వాలా లవ్’ మూవీ ట్రైలర్ ఆగస్ట్ 26.. మ్యూజిక్ లాంచ్ రోజున విడుదల చేయద్దామని ప్రయత్నించాం. టెక్నికల్ ప్రొబ్లెమ్స్ వలన వీలుపడలేదు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున విడుదల చేయాలనే నిర్ణయం యాధృచ్చికంగా తీసుకున్నదే. 1999 నుండి పవన్ కళ్యాణ్ వద్ద ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకుంటున్నాను. అతనొక బెస్ట్ టీచర్. నన్నొక పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్ గా తీర్చిదిద్దిన పవన్ కళ్యాణ్ కు ఎప్పటికి రుణపడి ఉంటాను. దర్శకురాలిగా నా ఫస్ట్ మూవీ ట్రైలర్ సెప్టెంబర్ 2న విడుదల చేయడం ఆ భగవంతుడి లీల. అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు రేణు దేశాయ్.

విడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్, రేను దేశాయ్ మంచి సత్సంభందాలు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డేకు రేణు దేశాయ్ గిఫ్ట్ అంటూ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. ఈ వార్తను పవన్ దృష్టికి తీసుకెళ్లగా సింపుల్ గా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నారు అని రేణు దేశాయ్ చెప్పారు. ‘ఇష్క్ వాలా లవ్’ తెలుగులో డబ్బింగ్ అవుతుంది.
Ranudesai

సంబంధిత సమాచారం

తాజా వార్తలు