మొత్తానికి ఎదురుచూపులకు తెరదించిన పవన్!

మొత్తానికి ఎదురుచూపులకు తెరదించిన పవన్!

Published on Sep 26, 2016 1:13 PM IST

katamarayudu

‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి పరాజయం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలస్యంగా చేయకుండా తన కొత్త సినిమాను చాలాకాలం క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు ఎస్.జె.సూర్య సినిమా నుంచి తప్పుకోవడంతో షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత డాలీని దర్శకుడిగా ఎంపిక చేసిన టీమ్ మళ్ళీ ప్రీ ప్రొడక్షన్‌ను కొత్తగా మొదలుపెట్టి పక్కా స్క్రిప్ట్‌తో గత వారమే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ మాత్రం ఈవారం రోజుల షూట్‌లో పాల్గొనలేదు.

దీంతో పవన్ ఎప్పుడెప్పుడు సినిమా షూట్‌లో జాయిన్ అవుతాడా అని అభిమానులంతా ఎదురుచూస్తూ వస్తున్నారు. తాజాగా ఈ ఎదురుచూపులకు తెరదించుతూ ఈ ఉదయమే పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా సినిమా సెట్స్‌లో జాయి అయిపోయారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో జరిగే ప్రేమకథగా ప్రచారం పొందుతోన్న ఈ సినిమా షూటింగ్ మొత్తాన్నీ డిసెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు