పవన్ కళ్యాణ్ హీరోగా ‘కత్తి’ రీమేక్..?

పవన్ కళ్యాణ్ హీరోగా ‘కత్తి’ రీమేక్..?

Published on Oct 24, 2014 3:40 PM IST

pawan_kalyan
ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమా తమిళంలో దీపావళి కానుకగా విడుదలై ఘన విజయం సాధిచింది. అంతే కాదు, సౌత్ ఇండియాలో ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ‘కత్తి’ సినిమాలో ప్రస్తావించారు. ఈ సినిమాను తెలుగులో 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరో పక్క నిర్మాతలు రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమాను రీమేక్ చేయడానికి, ‘కత్తి’ తెలుగు డబ్బింగ్ హక్కులు సొంతం చెసుకున్న నిర్మాత ఠాగూర్ మధు ప్రయత్నిస్తున్నారు అనేది లేటెస్ట్ టాక్. పవన్ కళ్యాణ్ ఐడియాలజీకి కథ దగ్గరగా ఉండడంతో ‘కత్తి’ రీమేక్ లో నటించడానికి అంగీకరిస్తారని నిర్మాత భావిస్తున్నారట. ఈ వార్తలు నిజమో..? కాదో..? తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

ప్రస్తుతం పవన్ ‘గోపాల గోపాల’లో నటిస్తున్నారు. తర్వాత ‘గబ్బర్ సింగ్ 2’ ప్రారంభమవుతుంది. వినాయక్ అఖిల్ డెబ్యూ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో.? లేదో..? చూడాలి. మరోవైపు తెలుగులో తన మార్కెట్ పెంచుకోవడానికి ప్లాన్ చేస్తున్న విజయ్, రీమేక్ అంటే ఒప్పుకుంటాడా..?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు