గూగుల్ టాప్ సెర్చ్ లో పవన్

గూగుల్ టాప్ సెర్చ్ లో పవన్

Published on Apr 18, 2014 12:09 AM IST

Pawan
గూగుల్ ఇండియా లిస్టులో పవన్ కళ్యాణ్ మొదటి స్థానంలో వున్నాడు. దేనికోసమా అని అనుకుంటున్నారా?? మోస్ట్ సెర్చేడ్ సెలబ్రిటీ గా పరిగణించి ఈ రికార్డు ను గూగుల్ సంస్థ విడుదల చేసింది. మార్కెట్ లో పవన్ కళ్యాన్ క్రేజ్ ని మరోసారి చూపించింది

పవన్ జనసేన ద్వారా ఎన్నికలలో నేరుగా పాల్గొనకపోయినా పాలిటిక్స్ కే కొత్త వన్నె తెచ్చాడు అని అనడంలో సంశయం లేదు. బి.జే.పీ తరుపున ప్రచారం చేస్తున్నందుకు ఆ పార్టీకీ తప్పకుండా వోట్లు పెరిగే అవకాశం వుంది

ప్రస్తుతం విజయవాడ ఎం.పి సీట్ వ్యవహారంలో పి.వి.పి కి నానికి మధ్య జరిగిన రాజకీయంలో పవన్ మరోసారి వార్తలలోకి వచ్చాడు. దీనికారణంగా టి.డి.పి – బి.జే. పి ల పొత్తుకు మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు పవన్ ఏం చేస్తాడో చూడాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు