బాబీ కోరిక పవన్ తీరుస్తాడా??

బాబీ కోరిక పవన్ తీరుస్తాడా??

Published on Dec 1, 2015 3:10 AM IST

pawan-kalyan
‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ, రెండవ సినిమాకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేసాడు. పవన్ కళ్యాణ్ – బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ లోని వడోదరలో జరుగుతోంది. కాజల్ అగర్వాల్, బ్రహ్మానందంలు కలిసి పవన్ తో సందడి చేస్తున్నారు. షూటింగ్ అప్డేట్ ని కాసేపు పక్కన పెడితే.. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న బిట్ సాంగ్స్ పాడారు. అత్తారింటికి దారేది సినిమాలో పాడిన కాటమరాయుడా సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.

సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా సందర్భానుసారంగా ఓ బిట్ సాంగ్ కి అవకాశం ఉంది. ఆ సాంగ్ ని పవన్ కళ్యాణ్ చేత పాడించాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయంపై దేవీశ్రీ ప్రసాద్ కూడా బాబీకి సపోర్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ ఐడియాని పవన్ కళ్యాణ్ ముందు ఉంచి పవన్ చేత పాట పాడించే పనిలో బాబీ ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ బాబీ కోరిక నేరవేరుస్తాడా లేదా అనేది చూడాలి. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూట్ ని ఇక కంటిన్యూగా చేసి వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు