జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ‘గబ్బర్ సింగ్ 2’

జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ‘గబ్బర్ సింగ్ 2’

Published on Apr 21, 2014 8:39 AM IST

All-set-for-Gabbar-Singh-2
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ప్రస్తుతం సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అనేది ఈ సారి ఎన్నికల బరిలో దిగకపోయినా, పవన్ బిజెపి పార్టీకి మద్దతు ఇవ్వడంతో బిజెపి పార్టీ తరపున

ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటికే కర్ణాటకలో ప్రచారం ముగించిన పవన్ త్వరలో తెలంగాణలో తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నాడు.

రాజకీయాలను పక్కన పెట్టి సినిమాల విషయానికి వస్తే పవన్ ఇప్పటికే ‘గబ్బర్ సింగ్ 2’, ‘ఓ మై గాడ్’ రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఎప్పుడు ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్తాయా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ శుభవార్త.. జూన్ నుంచి ‘గబ్బర్ సింగ్ 2’ సెట్స్ పైకి వెళ్లనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పవన్ ముందుగా ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాని మొదలు పెట్టి ఆ తర్వాత ఓ మై గాడ్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం.

‘గబ్బర్ సింగ్ 2’ కి సంపత్ నంది దర్శకుడిగా వ్యవహరిస్తుంటే, ‘ఓ మై గాడ్’ రీమేక్ కి డాలీ డైరెక్టర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు