శరవేగంగా ‘కాటమరాయుడు’ షూటింగ్ !
Published on Jan 28, 2017 1:03 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది పవన్ ఇంకా ఆర్టీ నీసన్, త్రివిక్రమ్ లాంటి దర్శకులతో ఇంకో రెండు సినిమాలు చేయాల్సి ఉండటంతో వీలైనంత త్వరగా సినిమాని ముగించాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్. ప్రస్తుతం పాటల చిత్రీకరణకు సిద్దమవుతున్న టీమ్ ఫిబ్రవరి మొదటి వారంలో ఫారిన్ షెడ్యూల్ కు వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

అలాగే ఫిబ్రవరి నెలాఖరుకల్లా షూటింగ్ మొత్తం పూర్తై చిత్రం మార్చి నెలాఖరులో సినిమా విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇకపోతే జనవరి 26న ఈ చిత్ర టీజర్ విడుదల కావాల్సి ఉండగా అది కాస్త వాయిదా పడింది. కొత్త తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన హీరోయిన్ గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook