హ్యాకింగ్ కు గురైన పవన్ అకౌంట్ !


స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. పవన్ ట్విట్టర్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ను దొంగిలించిన హ్యాకర్స్ ఆ తర్వాత పవన్ తన ఖాతాను యాక్సిస్ చేయలేని విధంగా చేశారు. మొదట ఏదో సాంకేతిక సమస్య అయి ఉంటుందని పవన్ అనుకొన్న పవన్ ఆ తర్వాత అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించి వెంటనే తన స్టాఫ్ ను అలర్ట్ చేశారు.

ప్రస్తుతం పవన్ అనుచరులు ట్విట్టర్ సిబ్బందితో సంప్రదింపులు జరిపి అకౌంట్ ను రిస్టోర్ చేసే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయపరమైన ఆలోచనలని, నిర్ణయాల్ని ట్విట్టర్ ద్వారానే అభిమానులతో, ప్రజలతో పంచుకుంటుంటారు. అలాంటి ముఖ్యమైన అకౌంట్ హ్యాక్ కావడం చేసిన వారు దుర్వినియోగనికి పాలపడతారేమోనని అభిమానులు కంగారులో ఉన్నారు. ఇప్పటికే పవన్ ఆఫీస్ నుండి కూడా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు అధికారిక ప్రకటన వెలువడింది.

 

Like us on Facebook