పవన్, తివిక్రమ్ ల సినిమా నవంబర్ లో ప్రారంభం..?

పవన్, తివిక్రమ్ ల సినిమా నవంబర్ లో ప్రారంభం..?

Published on Jun 1, 2016 8:31 AM IST

pawan-and-trivikram
ప్రస్తుతం యస్. జె. సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలో తివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చే నవంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. పవన్ కళ్యాణ్ త్వరలో సినిమాలు చేయడం మానేస్తానని ప్రకటించిన విషయం తెలిసింది. అందువల్ల పవన్ వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు.

అందువల్ల యస్. జె. సూర్య సినిమా పూర్తయిన తరువాత తివిక్రమ్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్టు తెలిసింది. అయితే గతంలో ప్రకటించినట్టు ఇది ’కోబలి’ సినిమానా లేక వేరొక కథ అన్నది తెలియరాలేదు. పవన్ కళ్యాణ్, తివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ’జల్సా’, ’అత్తారింటికి దారేది’ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన విషయం తెలిసిందే. తివిక్రమ్ దర్శకత్వం వహించిన ’అ..ఆ’ సినిమా జూన్ 2 విడుదల అవుతున్నది. ఆ తర్వాత తివిక్రమ్ పవన్ సినిమాపై దృష్టి సారిస్తారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు