సప్తగిరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ !

pawan
దర్శకత్వ శాఖ నుండి నటనలోకి ప్రవేశించి తక్కువ టైమ్ లోనే స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని స్వయంకృషితో ఇప్పుడు హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు నటుడు సప్తగిరి. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ నిన్న సాయంత్రం వైభవంగా ఆడియో వేడుక కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రావడం విశేషం. ఎప్పుడు బయటి ఫంక్షలకి పెద్దగా రాని పవన్ సప్తగిరి ఆడియోకి రావడం అందరికీ కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే పవన్ రాక వెనుక బలమైన కారణమే ఉంది.

ఆ కారణాన్ని పవన్ కళ్యాణ్ నే వేదికపై స్వయంగా చెబుతూ ‘మొదట మా సినిమాకి కాటమరాయుడు టైటిల్ అనుకున్నాం. తీరా చాంబర్స్ కెళ్ళి చూస్తే అక్కడ అప్పటికే సప్తగిరి సినిమా కోసం టైటిల్ రిజిస్టర్ చేసి ఉంది. మా వాళ్ళు వెళ్లి అడగ్గానే సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినా కూడా వాళ్ళు వెంటనే టైటిల్ మాకిచ్చేశారు. ఇదంతా పూర్తయిన తరువాతే విషయం నాకు తెలిసింది. మాకు ఇంతటి విలువ ఇచ్చిన సప్తగిరికి, వాళ్ళ టీమ్ కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు నా కోసం ఇంత చేశారు.. కాబట్టి వాళ్ళ కోసమే ఇక్కడికొచ్చాను. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. పవన్ రాకతో సప్తగిరి సినిమా పట్ల ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ శిష్యుడు అరుణ్ పవర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డా. రవి కిరానే నిర్మించారు.

 

Like us on Facebook