Like us on Facebook
 
చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ వస్తాడా ?

chiru-pawan

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’. 9 ఏళ్ల తరువాత చిరు రీ ఎంట్రీ ఇస్తూ చేస్తున్న చిత్రం కావడం వలన ఈ సినిమాకి సంబందించిన ప్రతి ఈవెంట్ ను భారీ ఎత్తున చేయాలని మెగా కుటుంబం భావిస్తోంది. అందుకే డిసెంబర్లో జరగబోయే ఆడియో వేడుకను వైభవంగా జరపాలనుకుంటున్నారు. అంతేగాక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించాలని కూడా మెగా ఫ్యామీలీ అనుకుంటోందట.

ఈ వార్తా బయటకు రాగానే ఒక వేళ చిరంజీవి పవన్ ను ముఖ్య అతిధిగా పేలిస్తే పవన్ వెళతాడా ? వెళ్లడా ? అనే విషయంపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. గతంలో పవన్ కళ్యాణ్ తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఆడియో వేడుకకు చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తే చిరు కాదనకుండా వెళ్లారు. కనుక కృతజ్ఞతగా ఈసారి చిరంజీవి పిలిస్తే పవన్ వెళ్లే అవకాశాలే ఎక్కువని అనిపిస్తోంది. పైగా ఇది ఆయన 150వ చిత్రం కావడం తమ్ముడు పవన్ కు కూడా ప్రత్యేకమే. అలాగే ఈ ఈవెంట్ కు బన్నీ,ధర తేజ్, వరుణ్ తేజ్, నాగ బాబు లాంటి మెగా హీరోలతో పాటు నాగార్జున కూడా హాజరవుతారని వినికిడి. మరి ఇక మెగా క్యాంపు నుండి వెలువడే అధికారిక ప్రకటనలో ఏముంటుందో చూడాలి.

Bookmark and Share