గన్ మెన్లను వెనక్కి పంపిన పవన్ !

గన్ మెన్లను వెనక్కి పంపిన పవన్ !

Published on Apr 18, 2018 11:41 AM IST

స్టార హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను వెనక్కి పంపేశారు. వివరాల్లోకి వెళితే మార్చి నెలలో గుంటూరు జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రభుత్వాన్ని రెండు రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉండటంతో తనకు సెక్యూరిటీని కేటాయించాలని పవన్ కోరడంతో ప్రభుత్వం ఆయనకు 2 ప్లస్ 2 గన్ మెన్ సెక్యూరిటీని కేటాయించింది.

కానీ ఈ సెక్యూరిటీని పవన్ నిన్న వెనక్కి తిరిగి పంపేశారు. పార్టీకి సంబందించిన అంతర్గత విషయాలు, కీలక నిర్ణయాలు, సమావేశ వివరాలు సెక్యూరిటీ ద్వారా బయటికి వెళుతున్నాయని భావించిన పార్టీ సభ్యులు, పవన్ ఈ పరిణామం పార్టీ మనుగడకు నష్టం చేకూరుస్తుందనే కారణంగా గన్ మెన్లను మర్యాదపూర్వకంగా వెనక్కి పంపేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు