చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ !

pawan-m
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో పూర్తిగా వెనుకబడ్డ, కష్టాల్లో కూరుకుపోయిన చేనేత పరిశ్రమకు అండగా ఉచితంగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. చాలా ఏళ్ల క్రితం పెప్సీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ తరువాతి కాలంలో తన ఇమేజ్ ఎంత పెరిగినా వేరే కమర్షియల్స్ జోలికి పోలేదు.

అలాంటి అయన ఈరోజు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని చేనేత సంఘాల నాయకులు కలిసి నేత కార్మికుల కష్టాలు వివరించి గడిచిన రెండున్నర ఏళ్లలో తెలంగాణాలోనే 45 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపి, వచ్చే నెల మంగళగిరిలో జరగనున్న చేనేత సత్యాగ్రహం, పద్మశాలి గర్జన కార్యక్రమాలకు విచ్చేసి తమకు అండగా నిలవాలని కోరారు. వారి విన్నపాన్ని అంగీకరించిన పవన్ స్వచ్ఛందంగా చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు కూడా అంగీకరించి తన వలన వీలైన ప్రతి సహాయం చేస్తానని మాటిచ్చారు.

janasena

 

Like us on Facebook