ఫాన్సీ రేటుకు పవన్ సినిమా ఆడియో రైట్స్ !
Published on Nov 4, 2017 11:54 am IST

పవన్ కళ్యాణ్ & త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలు ‘జ‌ల్సా’, ‘అత్తారింటికి దారేది’ ఎంతటి ఘన విజయం సాధించాయో అందరికి తెలుసు. కొంత గ్యాప్ తరువాత వస్తున్న వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘అజ్ఞాత‌వాసి’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది. కీర్తిసురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ఈ సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానున్నాడు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. ఈ ఆడియో సంస్థ ఫాన్సీ రేటుకు ఆడియో హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో ఈ సినిమా ఆడియో వేడుక అభిమానుల సమక్షంలో జరగనుంది. కుష్బూ, బొమన్ ఇరాని కీల‌క‌మైన పాత్ర‌ల్లో కనిపిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్ గా కనిపించబోతున్నాడు.

 
Like us on Facebook