పవన్ – త్రివిక్రమ్ ల సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనా ఎంతంటే !

పవన్ – త్రివిక్రమ్ ల సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనా ఎంతంటే !

Published on May 30, 2017 5:10 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కలయికలో సినిమా అంటే అభిమానులకు గొప్ప విశేషమనే చెప్పాలి. సినీ సర్కిల్స్, ప్రేక్షకుల్లో కూడా వీరి ప్రాజెక్ట్ పట్ల తారా స్థాయి అంచనాలుంటాయి. సినిమా హిట్టైతే వసూళ్లు భారీ స్థాయిలోనే ఉంటాయి. అందుకే సినిమా హక్కుల ధరలు కూడా ఆకాశాన్నంటే స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం వీరి కలయిలలో రూపొందుతున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అంచనాలు చూస్తే ఒకింత ఆశ్చర్యం కలుగక మానదు.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమా బిజినెస్ కు అత్యంత కీలకమైన నైజాం ఏరియాలో బిజినెస్ రూ. 32 కోట్ల వరకు, సీడెడ్లో రూ. 16 నుండి 18 కోట్లు, మిగిలిన ఆంద్ర ప్రాంతమంతా కలిపి అత్యధికంగా రూ. 45 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు. మరి సినిమా షూట్ ముగిసి ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయ్యే నాటికి ఈ లెక్కలు ఇలానే ఉంటాయా లేకపోతే మార్పులేమైనా చోటు చేసుకుంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు