హోదా కు మద్దత్తుగా మొదటి పాటని విడుదల చేసిన పవన్ కళ్యాణ్ !

హోదా కు మద్దత్తుగా మొదటి పాటని విడుదల చేసిన పవన్ కళ్యాణ్ !

Published on Jan 24, 2017 1:55 PM IST

Jana-Sena-Party-launch--(26
సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా రూపొందిస్తున్న ‘దేశ్ బచావో’ మ్యూజికల్ ఆల్బమ్ లోని మొదటి పాటని విడుదల చేశారు. ఓ వైపు కాటమరాయుడు సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటూనే ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దత్తు తెలుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ చిత్రంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘ట్రావెలింగ్ సోల్జర్’ పాటని దేశ్ బచావో ఆల్బమ్ లో రీమిక్స్ చేశారు. ఈ పాట మధ్యలో పవన్ కళ్యాణ్ రాజకీయ సభలలో ఉద్వేగంగా మాట్లాడిన కొన్ని పాదాలను జతచేసారు. ఈ ఆల్బమ్ లో మొత్తం ఆరు పాటలు ఉంటాయి. యంగ్ మ్యుజీషియన్ డీజే పృథ్వీ ఈ ఆల్బమ్ ని రూపొందించాడు. ఈ ఆల్బమ్ లోని తరువాత 3 పాటలు కూడా నేడే విడుదల కానున్నాయి.

పాట కోసం క్లిక్ చేయండి:

సంబంధిత సమాచారం

తాజా వార్తలు