బిజీ షెడ్యూల్లో కూడ చరణ్ కోసం టైమ్ కేటాయించిన పవన్ !
Published on Mar 27, 2018 6:04 pm IST

ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజును కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. మెగా హీరోలందరూ చరణ్ కు సామాజిక మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే రాజకీయపరమైన పనుల్లో బిజీగా ఉన్నా కూడ వీలు చేసుకుని మరీ అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి అన్న వదినలతో కలిసి చరణ్ తో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కుటుంసభ్యులతో కలిసి లంచ్ చేసి సరదాగా గడిపారు. దీనికి సంబందించిన ఫోటోలను చరణ్ సతీమణి ఉపాసన తన ఇన్స్టాగ్రమ్ ద్వారా షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇకపోతే చరణ్ నటించిన ‘రంగస్థలం’ మార్చి 30న విడుదలకానుంది.

 
Like us on Facebook
 

వీక్షకులు మెచ్చిన వార్తలు