సీక్రెట్ లొకేషన్ కి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ !

pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పొలాచ్చిలో షూట్ జరుగుతున్న ఈ షెడ్యూల్ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కొత్త షెడ్యూల్ మొదలయ్యే లోపల కాస్త బ్రేక్ తీసుకుకోనున్నాడట. ఈ బ్రేక్ లో పవన్ హాలీడే కి వెళ్లి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని జనవరి 2 లేదా 3వ తేదీల్లో హైదరాబాద్ తిరిగి వస్తారని తెలుస్తోంది.

అయితే పవన్ హాలీడే ఇండియాలోనే ఉంటుందా లేకపోతే ఫారిన్ లో ఉంటుందా, దానికి పవన్ ఒంటరిగా వెళతారా లేకపోతే కుటుంబంతో కలిసి వెళతారా అనేది మాత్రం గోప్యంగానే ఉంది. గతంలో కూడా పవన్ ఇలాగే ఎవరికీ తెలీని సీక్రెట్ లొకేషన్ కి హాలీడేకి వెళ్లిన సందర్భాలున్నాయి. ఇకపోతే పవన్ శరత్ మరార్ నిర్మాణంలో డాలీతో ప్రస్తుతం చేస్తున్న ‘కాటమరాయుడు’ పూర్తవగానే తమిళ దర్శకుడు నీసన్ సినిమాని మొదలుపడతారు. ఈ ప్రాజెక్టుని ఏఎమ్ రత్నం నిర్మిస్తారు. దీని తరువాత పవన్ త్రివిక్రమ్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తారు.

 

Like us on Facebook