టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన పవన్ కళ్యాణ్ లుక్

టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన పవన్ కళ్యాణ్ లుక్

Published on Apr 21, 2015 8:26 AM IST

pawan-kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఈ పేరుకి తెలుగు ప్రజల్లో మామూలు క్రేజ్ లేదు. అభిమానుల కోసం, ప్రజల కోసం ఏదన్నా చెయ్యాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ తన అభిమాని శ్రీజని హాస్పిటల్ లో పరామర్శించి, తను కోలుకునేలా చేసాడు. శ్రీజ పూర్తిగా కోలుకోవడంతో నిన్న శ్రీజ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ ని కలిసారు. ఇక్కడ ఈ విషయం కన్నా అందరినీ షాక్ చేసిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ న్యూ లుక్..

అలా అని తన తదుపరి సినిమా కోసం డిజైన్ చేసిన ఓ డిఫరెంట్ లుక్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫుల్ గా గడ్డం పెంచేసి, హెయిర్ పెంచేసి ఉన్నారు. చెప్పాలంటే ఆయన ఒక సినిమా హీరోలా లేరు, ఏదో ఒక మత పెద్ద లాగా ఉన్నారు. ఈ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవ్వడమే కాకుండా ఒక ప్రశ్నని కూడా రైజ్ ఉన్నారు. గబ్బర్ సింగ్ 2 లో ఏదో కొత్తదనం చూపించడానికేనా ఆయనిలా గడ్డం పెంచింది లేక షూటింగ్స్ కి గ్యాప్ ఇవ్వడం వలన కాజువల్ గా అలా గడ్డం పెంచారా.? అని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకి సమాధానం రావాలంటే పవన్ కళ్యాణ్ ఏ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 మే లో మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు