పవన్ లండన్ ట్రిప్ కు రెస్పాన్స్ అదిరింది

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ రీసెంట్ గా లండన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందించే ఎక్సలెన్సీ అవార్డును పవన్ కళ్యాణ్ అందుకొన్నారు.

పవర్ స్టార్ కి అక్కడ గ్రాండ్ వెల్కమ్ లభించింది. పవన్ అభిమానులు చాలా మంది వేడుకలో పాల్గొన్నారు. తెలుగు ఎన్నారైలు పవన్ ని కలవడానికి పోటీపడ్డారు. అంతే కాకుండా అక్కడి జనసేన అభిమానులతో కూడా పవన్ ప్రత్యేకంగా మాట్లాడారు. తనకోసం వచ్చిన అభిమానులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ టూర్ ముగిసిన తర్వాత పవన్ తన 25వ చిత్రం షూటింగ్ తో మళ్లీ బిజీ కానున్నాడు. ఆ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

 

Like us on Facebook