పక్కా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ‘స్పైడర్’ !
Published on Jul 2, 2017 10:39 am IST


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ కూడా ఒకటి. మొదట జూన్ లో విడుదల చేస్తామని చెప్పిన ఈ సినిమాను వాయిదా వేసి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. కానీ అది కూడా ఖచ్చితమైన తేదీ కాదని కొన్ని పుకార్లు పుట్టుకొచ్చాయి. దీంతో ఇప్పటికే ఈ సినిమా విషయంలో పలుసార్లు నిరుత్సాహానికి గురైన అభిమానుల్లో కాస్తంత కంగారు మొదలైంది.

వాళ్ళ కంగారును పోగొడుతూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వీ ప్రసాద్ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన పక్కాగా విడుదల చేస్తామని ప్రముఖ వార్తా పత్రిక ద్వారా తెలిపారు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా మిగిలిన రెండు పాటల్ని జూలై, ఆగష్టు నెలల్లో షూట్ చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చిత్రాన్ని హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే మహేష్ ఈ సినిమాతో పాటు కొరటాల శివ ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు.

 
Like us on Facebook