కమల్ హాసన్‌కు ఫైట్స్ కంపోజ్ చేయడం కష్టంగా ఉందట

కమల్ హాసన్‌కు ఫైట్స్ కంపోజ్ చేయడం కష్టంగా ఉందట

Published on Oct 17, 2019 4:16 PM IST

కమల్ హాసన్, శంకర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఇండియన్ 2’. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికిది సీక్వెల్. అందుకే సినిమా కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇందులో కూడా కమల్ యంగ్, ఓల్డ్ పాత్రల్లో కనిపించనున్నారు. వీటిలో ఓల్డ్ పాత్ర 90 ఏళ్ల వృద్దిడి పాత్ర అని తెలుస్తోంది.

ఈ పాత్రకి కూడా సినిమాలో ఫైట్స్ ఉండబోతున్నాయట. ఈ పాత్ర గురించి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మాట్లాడుతూ 90 ఏళ్ల వృద్దుడి పాత్రకు ఫైట్స్ కంపోజ్ చేయడం చాలా ఛాలెంజింగా ఉందని, ఏజ్ ఫ్యాక్టర్ వలన బాడీ మూమెంట్స్ డిజైన్ చేయడం కష్టంతో కూడుకున్న పని అని అన్నారు. అంతేకాదు కమల్ హాసన్ ఆ వృద్దుడి పాత్రలో ఒదిగిపోయారని, బాడీ మూమెంట్స్, మేనరిజమ్ అన్నీ ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నారని చెప్పుకొచ్చారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘భారతీయుడు 2’ పేరుతో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు