ఫ్యాన్సీ రేటుకి అమ్ముడైన ‘పైసా వసూల్’ హక్కులు !
Published on Jul 27, 2017 8:33 am IST


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ కూడా ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో, పూరి బాలయ్యను కొత్తగా ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలని నందమూరి అభిమానులంతా ఆతృతగా ఉన్నారు. పైగా రిలీజైన ఫస్ట్ లుక్స్ కు మంచి స్పందన రావడం, బాలకృష్ణ చాలా స్టైలిష్ గా కనిపిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ అంచనాల వల్లనే సినిమా హక్కులకు డిమాండ్ భారీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నైజాం ఏరియా హక్కుల్ని గ్లోబల్ సినిమాస్ ఫాన్సీ రేటు చెల్లించి కొనుగోలుచేసింది. ఈ అమౌంట్ ఎంతో ఖచ్చితంగా బయటకురాలేదు కానీ పెద్ద మొత్తమేనని మాత్రం తెలుస్తోంది. సెప్టెంబర్ 28న ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు .

 
Like us on Facebook