హైదరాబాద్ థియేటర్లలో ‘పీకే’ హంగామా..!

హైదరాబాద్ థియేటర్లలో ‘పీకే’ హంగామా..!

Published on Dec 19, 2014 8:35 AM IST

PK
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన ‘పీకే’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. అమీర్‌తో ‘3 ఇడియట్స్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన రాజ్ కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకుడు. విధు వినోద్ చోప్రా నిర్మాత. ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు కల ఈ సినిమా హైదరాబాద్ లో భారి ఎత్తున విడుదలవుతుంది.

ఈ శుక్రవారం ఒక్క రోజునే సిటీలో మల్టీప్లెక్స్ థియేటర్లలో 160 షోలు వేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ లలో కూడా ‘పీకే’ను బాగానే ప్రదర్శిస్తున్నారు. అమీర్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందొ మనం అర్ధం చేసుకోవచ్చు. నేడు సరైన తెలుగు సినిమాలు విడుదల కాకపోవడం కూడా ‘పీకే’ సినిమాకు కలిసోచ్చింది.

ఫస్ట్ లుక్(న్యూడ్ పోస్టర్) నుండి ట్రైలర్ వరకూ ప్రేక్షకులలో ‘పీకే’ సినిమాపై ఆసక్తిని రేపారు. హిందీ తెలియని వాళ్ళలో కూడా సినిమా చూడాలనే కోరిక కలిగింది. హైదరాబాద్ థియేటర్లు అన్ని ‘పీకే’ హంగామాతో నిండిపోయాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు