తన సపోర్ట్ ఎవ్వరికీ ఉండదన్న పవన్ కళ్యాణ్ !

తన సపోర్ట్ ఎవ్వరికీ ఉండదన్న పవన్ కళ్యాణ్ !

Published on Aug 16, 2017 5:50 PM IST


నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, అభ్యర్థుల మధ్య హోరా హోరీ పోటీ నడుస్తున్న సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల మీదే దృష్టి పెట్టి రాష్ట్రమంతా ఏపీలో మూడవ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ తన మద్దతును ఎవరికీ ప్రకటిస్తారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ తరుణంలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించిన పవన్ తాను ఎవరికీ సపోర్ట్ చేయబోనని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తన పార్టీ క్యాడర్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, తన మద్దత్తు ఉన్నట్టు ఎవరైనా చెప్పుకుంటే తనది బాధ్యత కాదని అంటూ 2019 ఎన్నికల వరకు ఎలాంటి ఎలక్షన్లలో పాల్గొనబోమని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు