నరేష్ ‘పరంపర’ చిత్రానికి ప్లాటినం అవార్డు.

నరేష్ ‘పరంపర’ చిత్రానికి ప్లాటినం అవార్డు.

Published on Oct 1, 2014 8:00 PM IST

param-para

సీనియర్ యాక్టర్ నరేష్, ఆమనీ ప్రధాన పాత్రలలో నటించిన తెలుగు చిత్రం ‘పరంపర’. ఈ చిత్రం ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పింది. ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘పరంపర’ ప్లాటినం అవార్డును దక్కించుకుంది. మధు మహంకాళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ మొదటివారంలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.

ఈ చిత్రం అక్టోబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్లాటినం అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని మరో ఐదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కు పంపించాం. అని మధు మహంకాళి తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, మాటలు, స్క్రీన్ ప్లేలను సమకూర్చారు. నిర్మాత కూడా ఆయనే.

మూడు తరాల మధ్య జరిగే కధాంశంతో ఈ చిత్రం రూపొందింది. తాతయ్య, తండ్రి, ఓ కుమారుడి మధ్య జెనరేషన్ గ్యాప్ వలన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది ‘పరంపర’ కథ. స్వచ్చమైన మానవీయ అనుబంధాలు, విలువలకు చిత్రంలో పెద్ద పీట వేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు