థియేటర్లలో జాతీయ గీతం ఇకపై తప్పనిసరి కాదు !

థియేటర్లలో జాతీయ గీతం ఇకపై తప్పనిసరి కాదు !

Published on Jan 9, 2018 1:36 PM IST

గతేడాది అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు దేశభక్తిని పెంపొందికిన్చే రీత్యా అన్ని సినిమా హాళ్లలోనూ ప్రదర్శనకు జాతీయ గీతం ప్రదర్శించాలని, ప్రేక్షకులంతా గీతాన్ని ఆలపించాలని ఆదేశించింది. దీంతో మల్టీ ప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఈ పద్దతిని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ దీనిపై కొందరు ప్రముఖులు, ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

కొందరి సుప్రీం కోర్టులో పిటిషన్ ను కూడా దాఖలు చేశారు. ద్దేన్తో మరోసారి ఈ అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం సినిమా హాళ్లలో జాతీయ గీతం తప్పనిసరిగా ఆలపించాలనేం లేదని తీర్పులో కీలక మార్పు చేసింది. ఈ తీర్పుతో ఇన్నాళ్లు ఈ తప్పనిసరి పద్దతిని వ్యతిరేకిస్తూ వచ్చిన అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు