రెండవ వారం కూడా కలెక్షన్లను సాధిస్తున్న పిల్లా నువ్వు లేని జీవితం

రెండవ వారం కూడా కలెక్షన్లను సాధిస్తున్న పిల్లా నువ్వు లేని జీవితం

Published on Nov 25, 2014 4:51 PM IST

Pilla-Nuvvu-Leni-Jeevitham
సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందనఅందుకుంది. ప్రస్తుతం రెండవ వారం లో కూడా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద నిలకడగా రాణిస్తుంది. గత వారం విడుదలైన ఏ సినిమా అంత ప్రభావం చూపకపోవడంతో సాయి ధరమ్ తేజ్ కి ఎదురులేకుండాపోయింది

పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో రెజినా హీరోయిన్. జగపతిబాబు ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడు. అల్లు అరవింద్, దిల్ రాజులు నిర్మాతలు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు