‘బాహుబలి’ పైరసీ సీడీలను సీజ్ చేసిన పోలీసులు !

‘బాహుబలి’ పైరసీ సీడీలను సీజ్ చేసిన పోలీసులు !

Published on May 3, 2017 10:50 AM IST


సౌత్ సినీ పరిశ్రమను పైరసీ భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అక్రమార్కులు అన్ని సినిమాలను పైరసీ చేస్తున్నారు. సినీ పెద్దలు, సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర ఈ పైరసీ తాలూకు మూలాలు బయటపడుతునే ఉన్నాయి. తాజాగా రిలీజై, దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ‘భాహుబలి-2’ చిత్రం కూడా ఈ పైరసీ బారిన పడింది.

ఆరంభంలోనే ట్రైలర్ అధికారికంగా విడుదల చేయడానికంటే ముందే నెట్ దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇవ్వగా ఇప్పుడు ఏకంగా సినిమానే సీడీల రూపంలో బయటికొచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్లకు మేజర్ ఏరియా అయిన విశాఖపట్నంలో ఈ పైరసీ వెలుగుచూసిందని ఒక ప్రముఖ వార్తా పత్రిక కథనం ప్రకారం తెలుస్తోంది. ఈ పైరసీ విషయాన్ని పసిగట్టిన పోలీసులు సంబంధిత సీడీ షాప్ పై రైడ్ నిర్వహించి 100 పైరసీ సీడీలను, ఇతర కొత్త సినిమా సీడిలను సీజ్ చేసి, షాప్ ఓనర్ ను అదుపులోకి తీసుకున్నారట. బాహుబలి చిత్ర నిర్మాతలు గతంలో పైరసీని ప్రోత్సహించవద్దని, ఎక్కడైనా పైరసీ జరుగుతున్నట్టు తెలిస్తే పోలీసులకు తెలియజేయమని విజ్ఞప్తి చేశారు. కనుక ప్రజలు కూడా సహకరించి ఈ పైరసీని అరికట్టి సినిమా మనుగడకు తొడ్పడాల్సిన అవసరం చాలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు