చిరు లానే పూజా కూడా రివీల్ చేసేసిందిగా.!

చిరు లానే పూజా కూడా రివీల్ చేసేసిందిగా.!

Published on Mar 6, 2021 8:00 AM IST

ప్రస్తుతం లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. అయితే ఈ సినిమాకు సంబంధించి షూట్ ఇప్పుడు శరవేగంగా నడుస్తుంది. ఇటీవలే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మెగా తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన టాకీ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక అప్డేట్ ను లేకుండా మెగాస్టార్ ఈ చిత్ర టైటిల్ ను ఎలా రివీల్ చేసేసారో తెలిసిందే. అలాగే గత కొంత కాలం నుంచి ఈ చిత్రంలో మరి హీరోయిన్ గా పూజా హెగ్డే ఉందని వార్త ఉంది కానీ దానిపై మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ తాను ఆచార్యలో ఉన్నట్టుగా పూజా హెగ్డేనే తనంతట తాను రివీల్ రివీల్ చేసెయ్యడంతో కన్ఫర్మ్ అయ్యిపోయింది. దీనితో చిరు లానే ఎలాంటి అధికారిక అప్డేట్ లేకుండానే ఈ సినిమాలో మేజర్ అప్డేట్స్ రివీల్ అయ్యిపోయాయి. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు