నా అకౌంట్ హ్యాక్ అయ్యింది.. ఫ్యాన్స్‌కి పూజాహెగ్ధే విన్నపం..!

నా అకౌంట్ హ్యాక్ అయ్యింది.. ఫ్యాన్స్‌కి పూజాహెగ్ధే విన్నపం..!

Published on May 28, 2020 1:54 AM IST

ప్రస్తుతమున్న టెక్నాలజీ కాలంలో సోషల్ మీడియా ప్రభావం మనపై ఏ విధంగా ఉందో పెద్దగా చెప్పనక్కర్లేదు. అయితే సోషల్ మీడియా వలన లాభాలెన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అంతే ఉన్నాయి.

అయితే టెక్నాలజీ పరంగా మంచి పట్టున్న హ్యాకర్లు చాలా మంది సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా హ్యాకర్ల కన్ను పూజాహెగ్ధేపై పడింది. అయితే తన ఇన్‌స్టా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని, ఈ విషయంపై తన డిజిటల్ టీం తనకు సాయం చేస్తుందని చెబుతూ, ఆ అకౌంట్ నుంచి వచ్చిన ఏ ఇన్విటేషన్స్ అక్సెప్ట్ చేయకండని, మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఏ వివరాలను ఆ అకౌంట్‌కి పంపించకండని ఫ్యాన్స్‌కి సూచించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు